రియల్ టెస్ట్
టీ20 ప్రపంచ కప్‌ను వరుసగా రెండోసారి గెలిచిన టీమిండియా ఫాన్స్‌లో ఫుల్ జోష్ నింపింది. ఇప్పుడు భారత్ జట్టుకు అంతర్జాతీయ సిరీస్‌లు రెండు నెలలు బ్రేక్.. ఆ తర్వాత హెడ్ కోచ్ గంభీర్‌కు అసలు సిసలు సవాల్ ఎదురుచూస్తోంది. అదే వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్‌కు అర్హత సాధించడం. వరుస పరాజయాలతో ఫైనల్ చేరే అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న టీమిండియా ముందంజ వేస్తుందా? తన తర్వాతి టార్గెట్ డబ్ల్యూటీసీ టైటిల్ అంటున్న గంభీర్ దానిని సాధిస్తాడా?
- గంభీర్‌కు అసలు పరీక్ష
అందని ద్రాక్షగా డబ్ల్యూటీసీ టైటిల్
టెస్టుల్లో భారత్ పేలవ ప్రదర్శన
డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం సవాలే
ముంబై, మార్చి 15: రాహుల్ ద్రవిడ్ తర్వాత భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న గౌతమ్ గంభీర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో మం చి విజయాలను అందుకున్నా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం ఘోర పరాజయాలను చవిచూసాడు. గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత, భారత్ చరిత్రలో మొదటిసారిగా స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో క్లీన్ స్వీప్‌కు గురైంది. ఇక ఇటీవలే దక్షిణాఫ్రికా కూడా భారత్‌ను స్వదేశంలో 0 -2తో టెస్ట్ సిరీస్‌లో ఓడించింది. విదేశాల్లో సిరీస్ గెలవడం మాట పక్కన పెడితే, టీమిండియా స్వదేశంలో కూడా సిరీస్‌లను కాపాడుకోలేకపోతోంది.
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా కేవలం బంగ్లాదేశ్, వెస్టిండీస్ వంటి జట్లపై మాత్రమే టెస్టు విజయాలను అందుకుంది. దీంతో గంభీర్‌ను టెస్ట్ కోచ్ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్ వినిపించింది. ఈ వరుస ఓటములతో భారత్ డబ్ల్యూటీ సీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ప్ర స్తుతం డబ్ల్యూటీసీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు ఏ కంగా ఆరో స్థానానికి పడిపోయింది.
స్వదేశంలో సౌతాఫ్రికా చేతుల్లో క్లీన్ స్వీప్ అయిన భారత జ ట్టు, ఇంగ్లాండ్ టూర్‌లో టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఈ సీజన్‌లో 48.15 శాతం విజయాలతో భారత జట్టు పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంటే.. పాక్ 50 శాతం విజయాలతో టాప్ 5లో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు వరుసస్థానాల్లో ఉన్నాయి. భారత్ చేతిలో రెండు టెస్టులు, ఆస్ట్రేలియా చేతిలో ఓడిన ఇంగ్లాండ్‌జట్టు, ఏడో పొజిషన్‌లో ఉంది.
ఐసీసీ వరల్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే మిగిలిన 9 టెస్టుల్లో కనీసం 7 మ్యాచులు గెలవాల్సి ఉంటుంది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసే వరకూ టెస్టు మ్యాచులు లేవు. 2026ఆగస్టులో శ్రీలంకతో రెండు టెస్టులు ఆడు తుంది. తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో సిరీస్‌లు ఉన్నాయి. టీ20 వరల్డ్‌కప్ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న గంభీర్ డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడమే తర్వాతి టార్గెట్ పెట్టుకున్నాడు.
దానికంటేముందు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడంపై ఫోకస్ పెట్టినట్టు వెల్లడించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తో పోలిస్తే టెస్ట్ క్రికెట్ తన హృదయానికి దగ్గరగా ఉం టుందన్నాడు. రెడ్‌బాల్ క్రికెట్‌లో సాధించిన విజయాలు ప్ర త్యేకంగా ఉంటాయన్న గంభీర్ ఒక జట్టు సత్తా తెలిసేది టెస్ట్ ఫార్మాట్‌తో మాత్రమేనని చెప్పుకొచ్చాడు. గంభీర్ చెప్పేది జరగాలంటే ముందు భార త్ కీలకసిరీస్‌ను గెలవాల్సిందే.
భారత జట్టు అక్టోబర్ 2026లో న్యూజిలాండ్‌లో న్యూజిలాండ్ తో2 టెస్టులు ఆడనుంది. న్యూ జిలాండ్‌లో న్యూజిలాండ్‌ను ఓ డించడం అంటే ఆస్ట్రేలియాలో ఆసీస్‌ను ఓడించ డం కంటే కష్టమైన పని. అక్కడి పిచ్‌లపై మనవాళ్లు పూర్తిగా తేలిపో తారు. కాబట్టి ఈ సిరీస్‌లపైనమ్మకం పె ట్టుకోవడం కూడా అ త్యాశే అవుతుంది. ఇ క 2027 జనవరిలో ఆ స్ట్రేలియా, భారత పర్యటనకు రానుంది. బో ర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఆ స్ట్రేలియాఇండియాలో ఐదు టెస్టులు ఆడుతుం ది. మిగిలిన 9 టెస్టుల్లో 7 విజయాలు భారత జట్టుకు చాలా కష్టమైన పని.




