25 April, 2026 | 2:01 AM

పేటీఎం లైసెన్సు రద్దు చేసిన ఆర్బీఐ!

25-04-2026 12:24 AM
  1. బీఆర్‌ఏ కింద కార్యకలాపాలు నిర్వహించొద్దు
  2. మనీలాండరింగ్, డిపాజిటర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహారశైలి
  3. పేమెంట్స్ బ్యాంకులో నిలిచిపోయిన చాలా సేవలు
  4. పేటీఎంకు లింక్ చేసిన యూపీఐ పేమెంట్స్ యథాతథం

ఢిల్లీ, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): ప్రము ఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎంకు ఊహించని షాక్ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్ లైసెన్సును రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ శు క్రవారం ప్రకటించింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఇకపై ఎలాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆదేశాలు జారీ చేసింది. డిపాజిటర్లు, ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తోందని, పేమెంట్స్ బ్యాంకును నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారని ఆర్బీఐ తెలిపింది.

ఒకే ఐడెంటిటీతో వేల సంఖ్యలో అకౌంట్లు తెరిచి ఉండడం వల్ల మనీ లాండరింగ్ ఆం దోళనలు పెరిగాయి. సమాచారాన్ని భద్రపరచడంలో లోపాలు ఉన్నట్లు ఆర్బీఐ గుర్తిం చిన క్రమంలో ఆంక్షలు విధించింది. ఈ కారణాలతోనే లైసెన్సును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకింగ్ సేవల మూసివేతపై హైకోర్టులో దరఖాస్తు చేస్తామని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిపాజిటర్లకు చెల్లించేందుకు తగిన నిల్వలు పేటీఎం వద్ద ఉన్నా యని పేర్కొంది.

తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో చాలా సేవలు నిలిచిపోయాయి. 2022న ఈ మేరకు కొత్త కస్టమర్లను చేర్చుకోవడంపై ఆంక్షలు విధించిన సంగతి తెలి సిందే. అయితే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసినా పేటీఎం యూపీఐ సేవల యాప్ పని చేస్తుంది. పేటీఎం యాప్ అనేది ఒక అగ్రిగేటర్.

ఇది  వేరే బ్యాంకులతో భాగస్వామ్యం ద్వారా యూపీఐ సేవలు అందిస్తోంది. వేరే బ్యాంకు అకౌంటును పేటీఎంకు లింక్ చేసి యూపీఐ పేమెంట్స్‌ను యథాతథంగా చేయవచ్చు. కేవలం పేటీఎం అనే యూపీఐ ఐడీ ఉన్నవారు, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ అకౌంట్ ఉన్నవారు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.