3 July, 2026 | 9:41 PM

Breaking News

ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •  

జిల్లా ప్రధాన కార్యదర్శిగా రవికుమార్ గాజుల కుమార్

20-03-2026 02:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా గాజుల రవికుమార్ నియమితులయ్యారు. గురువారం జిల్లా కమిటీని పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధికారికంగా ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ నాయకుడిగా, టిఆర్ఎస్వి ఉమ్మడి జిల్లా అధ్యక్షునిగా, పని చేసిన ఆయన కాంగ్రెస్ నియోజకవర్గ శ్రీ హరిరావుతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

కాంగ్రెస్ పార్టీ లో సీనియర్ యువ నాయకుడిగా, పనిచేస్తున్న ఆయన సేవలను గుర్తించి జిల్లా స్థాయిలో ఈ పదవి కట్టబెట్టారు. జిల్లా కమిటీలో స్థానం కల్పించిన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహర్ రావుకు, జిల్లా అధ్యక్షులు వెడుమ బుంజు పటేల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించినందుకు సంతోషంగా ఉందని ఆయన తెలిపారు