3 August, 2026 | 10:09 AM

రాష్ట్ర కార్యదర్శిగా రవికుమార్ ఎన్నిక

03-08-2026 09:03 AM

బైంసా ( విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ  కళాశాల గెజిటెడ్ అధ్యాపక సంఘం (TGCGTA) రాష్ట్ర కార్యదర్శిగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా కి చెందిన డాక్టర్ U రవికుమార్ ఏకగ్రీవం గా ఎన్నికైనట్లు, నిర్మల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీ రఘునాథ్, శ్రీ కట్ట రమేష్ రెడ్డి లు తెలియజేశారు. ఈ సందర్భంగా Dr రవి కుమార్ ను అధ్యాపకులు Dr K సూర్య సాగర్, Dr M శంకర్, Dr K మురళి, G. సుభాష్ తదితరులు అభినందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సమస్యలు పరిష్కరించి విద్యా ప్రమాణాలు పెంచుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు.