భారతదేశంలో తొలిసారిగా ఏవీపీఎన్ గ్లోబల్ కాన్ఫరెన్స్
హైదరాబాద్, 12 ఆగస్టు 2026: ఆసియాలోనే అతిపెద్ద సామాజిక ప్రభావ నేతల సమావేశమైన ఏవీపీఎన్ గ్లోబల్ కాన్ఫరెన్స్ 2026, ఆగస్టు 25 నుండి 27 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ఏవీపీఎన్ యొక్క ప్రతిష్టాత్మక వార్షిక సదస్సు యొక్క 13వ ఎడిషన్ మొదటిసారిగా భారతదేశానికి వస్తోంది. హైదరాబాద్‌లో సంస్థలు, ప్రైవేట్ సంపద మరియు కార్పొరేట్ విరాళాలు విస్తరిస్తున్న తరుణంలో ఇది జరుగుతోంది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద రూ. 1,054 కోట్లకు పైగా తెలంగాణ ఖర్చు చేయగా, భారతదేశంలో అత్యధిక సంపన్నులు ఉన్న నాలుగో అతిపెద్ద కేంద్రంగా హైదరాబాద్ అవతరించింది; భారతదేశం మరియు ఆసియాల సామాజిక ప్రభావ లక్ష్యాల సాధనలో ఈ నగరం అందించగల పెరుగుతున్న మూలధన వనరులు, దాతృత్వ దృక్పథం మరియు సంస్థాగత నాయకత్వాలకు ఈ రెండు మైలురాళ్లు సంకేతంగా నిలుస్తాయి.
ఆసియాలో అత్యంత కీలకమైన సామాజిక , పర్యావరణ ప్రాధాన్యతల కోసం పెట్టుబడులు మరియు భాగస్వామ్యాలను ఏ విధంగా సమీకరించవచ్చో చర్చించేందుకు, 2026 ఆగస్టు 25 నుండి 27 వరకు న్యూఢిల్లీలో "ఆసియాలో కార్యాచరణకు ఒక ప్రణాళిక" (ఏ బ్లూ ప్రింట్ ఫర్ యాక్షన్ ఇన్ ఆసియా ) అనే ఇతివృత్తంతో ఒక సమావేశం జరగనుంది. ఇందులో వివిధ ఫౌండేషన్లు, కార్పొరేట్ సంస్థలు మరియు సామాజిక సేవా సంస్థలకు చెందిన 2,000 మందికి పైగా ప్రభావవంతమైన దాతలు, పెట్టుబడిదారులు, విధాన రూపకర్తలు మరియు నాయకులు పాల్గొంటారు.
అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి, ‘శాశ్వతంగా నిలిచే వ్యవస్థలను నిర్మించడం: సంస్థలకు అతీతంగా ప్రభావాన్ని విస్తరించడం’ (బిల్డింగ్ సిస్టమ్స్ దట్ లాస్ట్ : స్కెలింగ్ ఇంపాక్ట్ బియాండ్ ఇన్స్టి ట్యూషన్స్ ) అనే అంశంపై ప్రసంగించనున్నారు. వ్యక్తులు లేదా సంస్థల కంటే ఎక్కువ కాలం నిలిచే ప్రభావాన్ని పర్యావరణ వ్యవస్థ విధానాలు ఎలా చూపగలవు, స్థిరత్వంను బలోపేతం చేయడంలో , విస్తరణను వేగవంతం చేయడంలో వివిధ రంగాల భాగస్వామ్యాల పాత్ర, ఇంకా సంస్థలలో దీర్ఘకాలిక సుస్థిరతను పొందుపరచడానికి ఆచరణాత్మక వ్యూహాలపై ఆమె తన ఆలోచనలను పంచుకుంటారు.హైదరాబాద్‌లో విస్తరిస్తున్న వ్యాపార, వ్యక్తిగత సంపద, సంస్థాగత విరాళాల పునాది, మరింత వ్యూహాత్మక సామాజిక ప్రభావం కోసం కొత్త అవకాశాలను సృష్టిస్తోంది.






