పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి
బాన్సువాడ, ఆగస్టు 26 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ సంధ్య రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌తో పాటు స్థానిక నాయకులు, వార్డు సభ్యులు కలిసి గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంధ్యారాణి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె అన్నారు. పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోందన్నారు.
ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఇంటి ఆవరణలో కనీసం ఐదు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పండరి, వార్డు సభ్యులు చిట్టి శివకుమార్, చిన్నోళ్ల మోహన్, బర్మల లక్ష్మణ్, స్థానిక నాయకులు బోయిని అంబయ్య, వీరబోయిన సాయిలు, చిక్క అశోక్, చాకలి హనుమాన్లు, యువకులు దేగ్లూరి సురేష్, గంజి హరీష్, సింగారం శివగౌడ్, ఫీల్డ్ అసిస్టెంట్ కాశిరాం, అంగన్‌వాడీ కార్యకర్తలు శివగంగా, సరిత, అనురాధ, ఆశా కార్యకర్త సవిత, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






