26 August, 2026 | 3:32 PM

మైలారం సున్నపు గుహల అభివృద్ధికి ప్రత్యేక కృషి

26-08-2026 02:57 PM

రూ. 20 లక్షలు మంజూరు 

గణపురం,ఆగస్టు 26 (విజయ క్రాంతి): గణపురం మండలంలోని మైలారం సున్నపు గుహలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయనున్నట్లు  కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ బి. ప్రభాకర్ తెలిపారు. బుధవారం మైలారం గుహలను సందర్శించి పరిశీలించారు. గుహల అభివృద్ధి పనులకు రూ.20 లక్షలు మంజూరైనట్లు ఆయన వివరించారు. గుహల సహజసిద్ధమైన ప్రత్యేకతలు, పర్యాటకులను ఆకట్టుకునే అంశాలు, సందర్శకులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై అధికారులతో చర్చించారు. పర్యాటకుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి అటవీ అధికారి అప్పలకొండ, చెల్పూర్ అటవీ క్షేత్ర అధికారి చంద్రమౌళి, అటవీ విభాగ అధికారి రాజేంద్రప్రసాద్ లు పాల్గొన్నారు.