అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వండి
హన్వాడ,ఆగస్టు 26,(విజయక్రాంతి): పెద్దదర్పల్లి ఎంపిటీసీ పరిధిలోని గ్రామాల అభివృద్ధికి అవసరమైన పలు పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ పాలమూరు ఎంపీ డీకే అరుణకు నాయకులు వినతిపత్రం అందజేశారు. బుధవారం పాలమూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీని కలిసి తమ సమస్యలను వివరించారు. నేషనల్ హైవే నుంచి కొత్తచెరువు తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణంతో పాటు ఎంపిటీసీ పరిధిలోని మూడు గ్రామాల్లో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఐమాక్స్ లైట్ల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.
గ్రామాల మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ డీకే అరుణ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, హన్వాడ మండల ఇన్‌చార్జ్ కిరణ్ కుమార్ రెడ్డి, పాలెమొన్ని కాలనీ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, పెద్దదర్పల్లి సర్పంచ్ గుముడాల దీప్తిరఘురాం గౌడ్, ఎనిమిది తండాల బూత్ అధ్యక్షులు విశాల్ నాయక్, బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.






