పి.ఆర్.ఏ. స్క్వేర్ ఇంటీరియర్స్ ప్రారంభం
26-08-2026 02:19 PM
సిద్దిపేటరూరల్, ఆగస్టు 26(విజయక్రాంతి): సిద్దిపేట పట్టణంలో పి.ఆర్.ఏ. స్క్వేర్ ఇంటీరియర్స్ నూతన ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వంగ రాజేశ్వర్‌రెడ్డి హాజరై సంస్థ నిర్వాహకుడు కొలుపుల ప్రవీణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వంగ రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేటలో నూతన వ్యాపార సంస్థలు ప్రారంభించడం అభినందనీయమన్నారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. పి.ఆర్.ఏ. స్క్వేర్ ఇంటీరియర్స్ మంచి పేరు సంపాదించి విజయవంతంగా ముందుకు సాగాలని కోరారు.






