26 August, 2026 | 3:15 PM

బీర్కూర్ సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు ధర్మతేజ కు ఘన సన్మానం

26-08-2026 02:35 PM

బాన్సువాడ, ఆగస్టు 26 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికైన సర్పంచ్ అరిగే ధర్మతేజకు బుధవారం ఘనంగా  సన్మానించారు. బాన్సువాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్‌ చైర్మన్ షేక్ జుబేర్ ధర్మతేజను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా షేక్ జుబేర్ మాట్లాడుతూ.. బీర్కూర్ మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ధర్మతేజ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. సర్పంచ్‌లను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని ధర్మతేజకు శుభాకాంక్షలు తెలిపారు.