వేగంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల పూర్తి
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే
నిజాంసాగర్ ఏప్రిల్ 23( విజయ క్రాంతి ) కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి గురువారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తొట లక్ష్మీకాంతరావు హాజరయ్యారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల ముఖాల్లో ఆనందాన్ని చూస్తే సంతోషమేస్తుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తూ ఉండడంతో ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్నాయన్నారు.
ఆయన వెంట కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఎలే మల్లికార్జున్, మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి మంద బలరాం,నాయకులు ప్రజా పండరి, రాము రాథోడ్, బంగ్లా ప్రవీణ్, అంజయ్య, గఫుర్, రవీందర్ తదితరులున్నారు.
బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన
నిజాంసాగర్ ఏప్రిల్ 23( విజయ కాంతి )కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పాపేశ్వర ఆలయం నుండి నల్లగుట్ట తండా వరకు ఒక కోటి ఆరు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులకు గురువారం నాడు జుక్కల్ శాసనసభ్యులు తోడ లక్ష్మీకాంతరావు శంకుస్థాపన చేశారు.
మారుమూల ప్రాంత గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువలు, త్వరితగతిన నిర్మించి గ్రామాల్లో పారిశుద్ధ్యన్ని నెలకొల్పేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు ఏలే మల్లికార్జున్, పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంకు లక్ష్మయ్య, స్థానిక సర్పంచ్ బోజ్జా అంజయ్య,డిసిసి ప్రధాన కార్యదర్శి మంద బలరాం, నాయకులు ప్రజాపండరి, గుర్రపు శ్రీనివాస్, రాజారామ్, తదితరులు పాల్గొన్నారు.






