31 May, 2026 | 6:54 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్

31-05-2026 06:06 PM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ కు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు  స్పందించారు. ఆదివారం నాగోలులోని శ్రేయాస్ కళాశాలలో ఏర్పాటు చేసిన పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్.రాంచందర్ మాట్లాడుతూ... ఈటల మీద కొందరు అభియోగాలు చేస్తున్నారని, మల్కాజిగిరిలో ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతల మధ్య ఐక్యతను దెబ్బతీయాలని కుట్రలు చేస్తూ అంతర్యుర్ధం తీసుకురావాలని చూస్తున్నారు. ప్లెక్సీలపై డీజీపీ, సైబరాబాద్ సీపీకి ఫిర్యాదు చేశామని రామచందర్ రావు పేర్కొన్నారు.

పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ అభియాన్ భావన, ప్రాముఖ్యతను మీడియాతో మాట్లాడి వివరించారు. భారతీయ జనతా పార్టీ ఒకే ఒక లక్ష్యంతో పనిచేస్తుందని, దేశం ముందు ఇలాంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా బీజేపీ కార్యకర్తల్లో సిద్ధాంతపరమైన స్పష్టత, క్రమశిక్షణ, సంస్థాగత నిబద్ధతతో పాటు సమాజం, దేశం పట్ల సేవాభావం మరింత బలపడుతుందని తెలిపారు.

బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు, ప్రజల కోసం నిరంతరం శ్రమించే అంకితభావం కలిగిన కార్యకర్తలతో నడిచే ఒక ఉద్యమమన్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల పాలనతో పూర్తిగా విసిగిపోయారు. అవినీతి, తప్పుడు హామీలు, దుర్వ్యవస్థాపన, ప్రజల పట్ల నిర్లక్ష్యాన్ని రెండు పార్టీల పాలనలో ప్రజలు చూశారని, తెలంగాణకు స్వచ్ఛమైన పాలన, అభివృద్ధి, బలమైన భవిష్యత్తును అందించగల ఏకైక విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని రామచందర్ రావు వెల్లడించారు.