31 May, 2026 | 6:54 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు

31-05-2026 06:13 PM

మధిర,(విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ టౌన్ అధ్యక్షులు, పీసీసీ సభ్యులు మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... మహమ్మద్ జావీద్ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన నాయకుడని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం నిరంతరం పనిచేసి కార్యకర్తలకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు.

ఖమ్మం పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు కొత్త సీతారాములు, కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ ప్రసన్న దేవి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కర్నాటి రామారావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ పులిబండ్ల చిట్టిబాబు, కాంగ్రెస్ నాయకుడు పత్తేపురపు సంగయ్య తదితరులు పాల్గొని మహమ్మద్ జావీద్‌కు ఘన నివాళులు అర్పించారు.