1 August, 2026 | 7:11 PM

విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం

01-08-2026 06:06 PM

ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్

జహీరాబాద్,(విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వవలసిన బకాయ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై నరోత్తం అన్నారు. శనివారం జహీరాబాద్ తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా విద్యార్థులకు బకాయి ఉన్న ఫీస్ రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు మనోవేదనకు గురవుతున్నారని ఆయన తెలిపారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాటిని వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వివిధ కళాశాలలో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో ఆయా కళాశాలల యాజమాన్యం విద్యార్థులను వేధిస్తున్నారని, కళాశాలలో చదివిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు మనోధైర్యాన్ని కోల్పోయి చదువుకు దూరం అవుతున్నారు.

దీనిలో దృష్టిలో పెట్టుకొని వెంటనే విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు రియంబర్స్మెంట్ ఆయా కళాశాలల యజమాన్యాలకు చెల్లించాలని ఆయన సూచించారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో రాష్ట్రంలోని కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని ఆయన కోరారు. బీద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో వారి చదువు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన పేర్కొన్నారు.