కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న రామన్నగారి రాఘవేందర్ గౌడ్
08-04-2026 12:15 AM
మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 7 (విజయ క్రాంతి): సైబరాబాద్ మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ పెద్ద చెరువు కట్టపై నెలకొన్న కట్ట మైసమ్మ బోనాల పండుగ ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మేడ్చల్ పెద్ద చెరువు కట్టపై ఏర్పాటుచేసిన కట్ట మైసమ్మ బోనాల పండుగ ఉత్సవాల సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ రాఘవేందర్ గౌడ్ మేడ్చల్ ముదిరాజ్ సంఘం సభ్యులు ఆయనకు శాలువాతో సత్కరించి ఆహ్వానించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు హాజరు కాగా సాకర బోయిన.వెంకటేశం.శ్రీను.నర్సింగరావు.నడికొప్పు దర్శన్.రాములమ్మ.విజయ్ రావు తదితరులు పాల్గొన్నారు.




