30 June, 2026 | 2:55 AM

హీరోగా.. దర్శకుడిగా రామ్ పోతినేని

30-06-2026 01:07 AM

రామ్ పోతినేని మరో కొత్త సినిమాను అధికారికంగా ప్రారంభించారు. ప్రస్తుతం ‘రాపో23’ అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రంతో రామ్ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా సోమవారమే హైదరాబాద్ శివార్లలో ప్రారంభ మైంది. కథానాయకుడు రామ్ పోతినేని చిత్రంలోని ప్రధాన తారాగణంతో కలిసి షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

నియో-నోయర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం పలువురు ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి తిరునావుకరసు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, పీటర్ హైన్ యాక్షన్ సన్నివేశాలను రూపొందిస్తున్నారు. ఏఎస్ ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.