29 August, 2026 | 12:22 AM

ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

28-08-2026 10:03 PM

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక

కోనరావుపేట,(విజయక్రాంతి): అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని చాటి చెప్పే రక్షాబంధన్ వేడుకలను కోనరావుపేట మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీలు కట్టి ప్రేమాభిమానాలను చాటుకున్నారు. రాఖీ పండుగ సందర్భంగా కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్యకు ఆయన సోదరి ఉడతల గీత రాఖీ కట్టి ఆత్మీయతను చాటుకున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ఉన్న అనురాగం, ఆప్యాయతలకు ప్రతీకగా రక్షాబంధన్ పండుగను కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.