బాలసదనంలో రక్షాబంధన్ వేడుకలు
పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్ధిపేట, ఆగస్టు 28 (విజయక్రాంతి): సోదరభావానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగ అని సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. సిద్ధిపేటలో రక్షాబంధన్ పండుగ బాలసదనంలోనీ బాలికలతో నిర్వహించారు. అత్తు ఇమామ్ ఆధ్వర్యంలో విద్యార్థినీలతో ముస్లిం కాంగ్రెస్ నాయకులు రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా అత్తూ ఇమామ్ మాట్లాడుతూ రాఖీ ప్రాధాన్యతను వివరిస్తూ కులమతాలకు అతీతంగా సోదరభావంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.
రక్షాబంధన్ భారతీయ సంస్కృతిలో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని అయితే నేటి సమాజంలో ఇది మత సామరస్యం, సోదరభావం, పరస్పర గౌరవానికి కూడా ప్రతీకగా మారిందన్నారు. మహిళల రక్షణ, గౌరవం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు.
సిద్ధిపేటలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి పండుగ వేడుకలు జరుపుకుంటారని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక గౌరవం ఇస్తూ పెద్దపీట వేస్తున్నరని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి కోసం మరో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ చైర్మన్ రైసోద్దీన్, గ్యాదరి మధు, వహాబ్ గయాజుద్దీన్, అర్షద్ హుస్సేన్, విజయ్, డానియల్, అజ్మత్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.






