రాఖీ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
28-08-2026 06:02 PM
ఆలేరు,(విజయక్రాంతి): రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత రాఖీ పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలేరు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు, ఆడపడుచులు బీర్ల అయిలయ్యకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
తనపై చూపిన ప్రేమాభిమానాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా బీర్ల అనిత అన్నదమ్ములకు రాఖీలు కట్టి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పౌర్ణమి సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలుస్తుందని, కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు.






