చిన్నకల్వల వద్ద లారీ బోల్తా
బొలెరా వాహనం డ్రైవర్ కు తీవ్ర గాయాలు.....
సుల్తానాబాద్, మే 21 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల స్టేజి వద్ద రాజీవ్ రహదారిపై గురువారంతెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి కరీంనగర్ నుంచి మంచిర్యాలకు మామిడి కాయల లోడుతో వెళ్తున్న బొలెరోవాహనాన్ని పత్తి గింజల లోడుతో వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ క్రమంలో బొలెర వాహనం డివైడర్ పై నుంచి కరీంనగర్ వైపు వెళ్లే రాజీవ్ రహదారిపై బోల్తా పడింది.
వెనకాల నుంచి వస్తున్న లారీ కూడా అదుపుతప్పి కొంత దూరం వెళ్లి బోల్తా పడింది. బొలెరో లో ఉన్న డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకొని హుటా హుటిన సంఘటన స్థలానికి సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. దీంతో వాహనదారులు యధావిధిగా వెళ్లిపోయారు, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు.






