జనకరణకు ప్రజలు సహకరించాలి
21-05-2026 03:38 PM
నిర్మల్ మే 21 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో 2027 జనగణ లో భాగంగా ఇంటి గణన సర్వేకు ప్రజలు సహకరించాలని నిర్మల్ రూలర్ తాసిల్దార్ ప్రభాకర్ అన్నారు. గురువారం నిర్మల్ మండలంలోని అక్కాపూర్ ముఠాపూర్ గ్రామాల్లో సర్వే సిబ్బంది సేకరిస్తున్న వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి ఇంటి యజమాని సర్వ సిబ్బందికి ఇంటికి సంబంధించిన వివరాలను తెలుపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ విజయకుమార్ రెవెన్యూ సిబ్బంది ఉన్నారు






