21 May, 2026 | 4:30 PM

మండేపల్లిలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ

21-05-2026 03:39 PM

తంగళ్ళపల్లి,మే 21 (విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న వారికి  సర్పంచ్ గాధగోని సాగర్ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎండలో డి హైడ్రేట్ కాకుండా ఉండడానికి తగు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగింది. ఎండకు శరీరం  డిహైడ్రేట్ అవుతుందని అత్యధికంగా నీరు తీసుకోవడం ద్వారా శరీరానికి ఎంతో మేలు అని తెలిపారు. ఎండలో పనిచేసిన కూలీలకు కాసేపు నీడలో విశ్రాంతి తీసుకోవడానికి పందిరి , గ్రీన్ షేడ్ నెట్స్ వేయడం జరిగిందని, ఏమైనా గాయాలు అయినప్పుడు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉందని అన్నారు. ఎండకు వడదెబ్బ తగలకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాధగోని సాగర్, ఉప సర్పంచ్ ఆస సందీప్,వార్డు సభ్యులుకొమ్మెట మల్లేశం, జడల ఆనంద్, యాస మధు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి ప్రశాంత్ , ఫీల్డ్ అసిస్టెంట్ దేవయ్య, తదితరులు పాల్గొన్నారు.