క్రీడాకారులకు సన్మానం
నిర్మల్ మే 21 (విజయ క్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా యువజన సర్వీసులు ,క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురు వారం స్థానిక నిర్మల్ క్లబ్ లో పర్యాటక. క్రీడలపైఅవగాహన కల్పించారు . కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న హాజరయ్యారు . తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా ఉందని తెలిపారు. ముఖ్యంగా నిర్మల్ జిల్లాలో ఉండే పర్యాటక ప్రాంతాలకు ప్రత్యేక గుర్తింపునిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు బాసర ఆలయాన్ని పునరుద్ధరణ పనులను ప్రారంభించారని తెలియజేశారు.
నిర్మల్ జిల్లాలో ఉండే పర్యాటక ప్రాంతాలని యూట్యూబ్, సామాజిక మధ్య మాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తున్న అమ్మ సాయి, నిఖిల్ యూట్యూబర్స్ ని ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా విద్యాధికారి దర్శనం భోజన్న, ఎల్. డి. ఎం. రామ్ గోపాల్, నిర్మల్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎర్రవోతు రాజేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, గేమ్స్ సెక్రటరీ అనుముల రాజేశ్వర్, వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష కార్యదర్శులు, శిక్షకులు, క్రీడాకారులు, తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






