21 May, 2026 | 3:53 PM

ఎల్లయ్య చెరువులో అక్రమ తవ్వకాలను ఆపాలంటూ... బీజేపీ, బీఆర్ఎస్ ధర్నా

21-05-2026 02:51 PM

బాన్సువాడ ఆర్డీవో కార్యాలయం ముందు బిజెపి, బిఆర్ఎస్ కౌన్సిలర్ ల ధర్నా...

బాన్సువాడ, మే 21 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని.ఎల్లయ్య చెరువులో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను ఆపాలనీ డిమాండ్ చేస్తూ బిజెపి,బీఆర్ఎస్ పార్టీల కౌన్సిలర్లు గురువారం బాన్సువాడ ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీకి లాభం వచ్చేలా టెండర్ వేసి తవ్వకాలు జరపాలనీ,అలాగే ఇల్లీగల్ లేవట్లు నాలాల కబ్జాలు  బఫర్ జోన్లు ఇవ్వకుండా ప్లాట్లు ఇల్లీగల్ కట్టడాలు నిలిపి వెయ్యాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో డీఏవో అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఖలీల్ సామల శ్రీకాంత్ గజ్జల మహేష్, గడ్డం మీది అంజా గౌడ్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.