20 March, 2026 | 6:45 AM

నేడు, రేపు వర్షాలు

20-03-2026 12:00 AM

తగ్గనున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్, మార్చి 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో శుక్ర, శనివారాల్లో పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ గురువారం తెలిపింది. 30 నుంచి 40 గంటల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఈమేరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. రాష్ట్రంలో రాబో యే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గుతాయని, ఆ తర్వాత వచ్చే మూడు రోజు ల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని వివరించింది.