ఇటు వాన.. అటు ఎండ!
- కొనుగోలు కేంద్రాలలో ముద్దైతున్న ధాన్యం కుప్పలు
- ధాన్యం విక్రయంలో వేగంపెంచండి సార్..
- అన్నదాతకు తప్పని తిప్పలు
ఎల్లారెడ్డి, మే 25 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి, మండలం లోని ఎల్లారెడ్డి, పలు గ్రామాల్లో సోమవారం మధ్యానం,కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. బారీగా వీచిన గాలికి ధాన్యం కుప్పల పైనుండి ఎగిరిపోయి అన్నదాతకు, అపరా, అవస్థలు, పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నుండి ధాన్యాన్ని త్వరగా విక్రయించాలని, రైతులు, ప్రభుత్వంను వేడుకుంటున్నారు.
అన్నదాతకు, ఇంకా ఎన్నాళ్లు
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం, కుప్పలు, నింపిన ధాన్యం బస్తాలు, లారీలు, లేక ఎక్కడిక్కడే, నిలిచిపోవడంతో అన్నదాధతలు అవస్థలు పడుతున్నారు. లారీలను కొనుగోలు, కేంద్రాల వద్దకు త్వరగా పంపిస్తే రైతులకు ధాన్యం సేకరణ చేస్తే రైతులు సంతోష పడుతున్నారని పలువురు రైతులు అధికారులను వేడుకుంటున్నారు. పంట కోసి కనీసం సుమారు 2మాసాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కొనుగోలు కేంద్రాల వద్దనే మూలుగుతున్న ధాన్యం. ఇకనైన రైతుల సమస్యను ప్రభుత్వం నిర్ణయంగా తీసుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.






