మరో వారంపాటు వర్షాలు కష్టమే!
నల్లగొండలో అత్యధికంగా 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో వారం రోజులపాటు వర్షా లు కురిసే పరిస్థితి కనిపించడంలేదు. ఎండాకాలాన్ని తలపించేలా రాష్ట్రంలో ఉష్ణోగ్ర తలు నమోదవుతున్నాయి. వేడి, తేమతో కూడిన పరిస్థితులు పలు జిల్లాల్లో ఉంటాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నెల 21 వరకు బలమైన ఉపరితల గాలులు వీస్తాయని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు దాటింది.
అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 39.5 డిగ్రీలు నమోదు కాగా, సూర్యాపేట-39.4, మంచిర్యాల-39.2, నిజామా బాద్-39.2, నిర్మల్-39.1, వరంగల్- 39.1, మహబూబ్‌నగర్-39.0 డిగ్రీలు నమోదైంది. ఎల్‌నినో ప్రభావంతో దేశంలో రుతుపవనాలు విస్తరించక వానలు కరువయ్యాయి. ఇదిలా ఉండగా బంగా ళాఖాతంలో ఏర్పడుతున్న ఒక బలమైన అల్పపీడన ద్రోణి కారణంగా రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతాయని ఐఎండీ అంచనా వేస్తోంది.






