రైల్ పార్శిల్ యాప్ ప్రారంభం
- డోర్ టు డోర్ పార్శిల్ సేవలు ప్రారంభించిన ద.మ రైల్వే
- మొబైల్ యాప్ ద్వారా పార్శిల్ బుకింగ్
సికింద్రాబాద్ ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): రైల్వే సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అత్యాధునిక సాంకేతికతతో పారదర్శకమైన ట్రాకింగ్ సౌకర్యంతో రైల్ పార్సెల్ యాప్ సేవలు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అన్నారు. ఈ సందర్భం గా భారతీయ రైల్వేలో ఈ పైలట్ ప్రాజెక్టును అమలు చేస్తున్న మొదటి డివిజన్ గా హైదరాబాద్ డివిజన్ నిలిచింది అని అన్నారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫ్రైట్ లాజిస్టిక్స్ మార్కెట్ పై సమగ్ర అధ్యయనం చేపట్టేందుకు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ బెంగళూరు (ఐఐఎమ్) బెంగళూభారతీయ రైల్వేలు మొట్టమొదటి రైల్ పార్శిల్ యాప్ను దక్షిణ మధ్య రైల్వే తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. వినియోగదారులు ఇకపై పార్శిల్ బుకింగ్ కోసం రైల్వే స్టేషన్లకు రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఒక మొబైల్ యాప్ ద్వారా ఇంటి నుంచే పార్శిళ్లను పంపవచ్చని, ఇది సామాన్య ప్రజలకు, చిన్న వ్యాపారులకు ఎంతో ఊరటనిస్తుందని,ఈ విధానం ద్వారా పార్శిళ్లను కస్టమర్ ఇంటి వద్దే సేకరించి, గమ్యస్థానానికి చేర్చే పూర్తి బాధ్యతను రైల్వే తీసుకుంటుందని, అత్యాధునిక సాంకేతికతతో,పారదర్శకమైన ట్రాకింగ్ సౌకర్యంతో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని శ్రీవాస్తవ వెల్లడి ంచారు.
ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే,రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ కె. పద్మజ, దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ఆర్థిక సలహాదారు హేమ సునీత, హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ, సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్,ఇతర సీనియర్ రైల్వే ఉన్నత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




