ఘనంగా రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలు
- వరంగల్‌లోని పోచమ్మ మైదాన్ జంక్షన్‌లో నిర్వహణ
- పాల్గొన్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు
వరంగల్, జూన్ 19(విజయక్రాంతి): కాం గ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ 56వ జన్మదిన వేడుకలను శుక్రవారం ఉదయం వరం గల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బ స్వరాజు సారయ్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్, పీసీసీ డెలిగేట్ సభ్యులు టైగర్ నల్గొండ రమేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీ కేక్‌ను కార్యకర్తలతో కట్ చేయించారు.
పేదలకు, స్థానికులకు పండ్లు పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు గుండేటి నరేంద్ర కుమార్, బస్వరాజు శిరీష -శ్రీమాన్, సోషల్ మీడియా వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ సోమ లక్ష్మి, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కరాటే ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల కార్యవర్గ సభ్యు లు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొరివి పరమేష్, కార్యకర్తలు, సేవాదళ్ కార్యకర్తలు, స్థా నిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేసినట్లు నల్గొం డ రమేష్ తెలిపారు.






