అమిత్‌షా వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
అమిత్ షా ఉపన్యాసం వినేందుకు సిద్ధంగా లేము
కాల్పులకు ఆదేశించింది అమిత్ షాయేనా?
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) వ్యాఖ్యలపై లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా ఉపన్యాసం వినేందుకు సిద్ధంగా లేమని రాహుల్ గాంధీ వెల్లడించారు. మాకు ఉపన్యాసాలు కాదు.. సమాధానాలే కాలని డిమాండ్ చేశారు. మన విద్యార్థులపై కాల్పులు జరిపిందెవరు?,మన విద్యార్థులపై కాల్పులకు ఆదేశించిందెవరు?, ఒక విద్యార్థి కళ్లు పోగొట్టిందెవరు?, మేకులతో ఉన్న కర్రలతో దాడికి ఆదేశాలిచ్చిందెవరు? అని వరస ప్రశ్నలు సంధించారు. ఈ ఆదేశాలన్నీ హోంశాఖ నుంచే వాచ్చాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాల్పులకు ఆదేశించింది అమిత్ షాయేనా?, కాల్పులకు అమిత్ షా ఆదేశించి ఉంటే రాజీనామా చేయాల్సిందేనని రాహుల్(Rahul Gandhi) డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే సమయానికి అమిత్ షా డ్రామాలాడుతున్నారని ఫైర్ అయ్యారు.






