12 August, 2026 | 4:28 PM

మంథనిలో హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన

12-08-2026 03:48 PM

మంథని,(విజయక్రాంతి): ప్రజల్లో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించేందుకు పీహెచ్‌సీ గద్దలపల్లి ఆధ్వర్యంలో బుధవారం మంథనిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఐవీ వ్యాప్తికి కారణాలు, నివారణ చర్యలు, అపోహలు–నిజాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంథని పట్టణ చైర్మన్ వొడ్నాల శ్రీనివాస్ హాజరయ్యారు. వైస్ చైర్మన్ ముసుకుల సహేందర్‌రెడ్డి, కౌన్సిలర్ ఎల్లంకి వంశీ, డాక్టర్ సబ్బని శివాని పాల్గొని హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌పై అవగాహన కల్పించారు. ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్‌వైజర్లు, ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.