లోక్‌సభ రేపటికి వాయిదా
న్యూఢిల్లీ: అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర గందరగోళం నెలకొన్న నేపథ్యంలో వర్షాకాల సమావేశాల ముగింపునకు ముందు రోజున లోక్‌సభ(Lok Sabha adjourned) బుధవారం నాడు వివాదాస్పద FCRA సవరణ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. అలాగే, గనులు, ఖనిజాల అభివృద్ధికి సంబంధించిన చట్టాలను సవరించే బిల్లును ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదించింది. విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ 13.08.2026 ఉదయం 11:00 గంటలకు వాయిదా పడింది. రోజు ప్రారంభంలో నిరసన తెలుపుతున్న ప్రతిపక్ష సభ్యులతో స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ, అధికార పక్షంతో వారి విధానాలు, ఆలోచనలు భిన్నంగా ఉన్నప్పటికీ, సభ సజావుగా సాగాలని దేశం కోరుకుంటోందని అన్నారు. నిరసనలు, నినాదాలతో సభ ప్రతిష్టను దెబ్బతీయడం సరికాదని నొక్కి చెబుతూ, సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఓం బిర్లా ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.






