పాన్ మసాలా ప్లాస్టిక్ ప్యాకేజింగ్‌పై FSSAI నిషేధం
న్యూఢిల్లీ: భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (Food Safety and Standards Authority of India) పాన్ మసాలా ప్యాకేజింగ్ నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం, పాన్ మసాలాను ప్లాస్టిక్ రహిత కాగితం, పేపర్‌బోర్డ్, సెల్యులోజ్, టిన్ లేదా గాజు పాత్రలలో మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ప్రజారోగ్య, పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకుని, పాన్ మసాలా ప్యాకేజింగ్‌లో ప్లాస్టిక్, ప్లాస్టిక్ లామినేషన్, అల్యూమినియం ఫాయిల్ వాడకంపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పూర్తి నిషేధాన్ని విధించింది. ప్లాస్టిక్ ప్యాకెట్లలో పాన్ మసాలాను నిల్వ చేయడం వల్ల కలిగే రసాయన ప్రతిచర్యలు, మైక్రోప్లాస్టిక్ కాలుష్యం ప్రమాదాన్ని తగ్గించడం, తద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించడం ఈ చర్య లక్ష్యమని ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI) వెల్లడించింది.






