23 July, 2026 | 5:42 PM

బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం

23-07-2026 04:49 PM

శాంతి భద్రతలు విఘాతం కలిగిం కలిగించేందుకే కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాలు

కామారెడ్డి, జూలై 23 (విజయక్రాంతి): శాంతి భద్రతలు విఘాతం కలిగించేందుకే రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఢిల్లీలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారని బిజెపి జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజు లు అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోభారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... మొన్న కావాలని దూరుద్దేశంతో శాంతి భద్రతలు విఘాతం కల్గించడం కోసం రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రధాన మంత్రి ఇంటిని ముట్టడించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ వద్ద రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం చేసే ప్రయత్నం చేస్తే పట్టణ పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశం ప్రారంభమైన తర్వాత దేశానికి ఉపయోగపడే బిల్లులు ఆమోదించే క్రమంలో గౌరవ నరేంద్ర మోదీ  పని చేస్తుంటే, కావాలని శాంతి భద్రతలు విఘాతం కలిగించాలనే దురుద్దేశంతో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని ఇంటిని ముట్టడించడం దురదృష్టకరం అని అన్నారు. దేశ విద్రోహ శక్తులను ఉసిగొల్పి దేశంలో అశాంతి నెలకొల్పడమే కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.

నీట్ పరీక్షల ముసుగులో కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయాలను అందరూ గమనిస్తున్నారు. నీట్ ను అడ్డుపెట్టుకొని కమ్యూనిస్టులు, దేశ వ్యతిరేక శక్తులు దేశాన్ని విడగొట్టాలని కుట్రలు చేస్తున్నారనీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 ని మళ్లీ తీసుకురావాలని, ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలని మాట్లాడుతున్నారు. అసలు సనాతన ధర్మానికి, ఆర్ఎస్ఎస్ కు, నీట్ పరీక్షలకు సంబంధం ఏంటి? అని ఆఆయనప్రశ్నించారు.ఇది నవ భారతం, మోదీ గారి భారతం. ఇలాంటి విచ్ఛిన్నకర శక్తుల కుట్రలకు బీజేపీ ఏమాత్రం భయపడదనీ, మోదీ గారిని బలహీనపరుస్తామనే పగటి కలలు కనడం రాహుల్ గాంధీ  ఇకనైనా మానుకోవాలనీ హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ గుప్తా, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి, రాజు పాటిల్, కాసర్ల రవీందర్, వెంకటేష్, నరేందర్, కౌన్సిలర్ లు కైరా రాహుల్ గౌడ్, కుంట లక్ష్మారెడ్డి, మహిళా కౌన్సిలర్ లు వినోద, మాధవి, తదితరులు పాల్గొన్నారు.