రాధా రమణ..
బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా సమర్పణలో రూపొందుతున్న కొత్త సినిమా ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్‌కుమార్ జంట గా నటిస్తున్నారు. భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్‌రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణు గోపాల్‌రెడ్డి రూపొందిస్తున్నారు. సెప్టెంబర్ 3న రిలీజ్ కానున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘రాధా రమణ’ రిలీజ్ చేశారు.
‘రాధారమణ రాగాలు మనసున మోగే వేళలో.. ఏదో తపన తాగేసి వయసులు ఊగే లీలలో.. ఓ కన్నా నీ అందమే అలలై అలలై ముంచే.. కన్నుల్లో అందుకే కలలే కథలే పెంచే.. ఆవేశమే తెరచాటుగా లాగగా.. బిడియాల ఆదేశమే పొరపాటనీ ఆపగా.. ఈ ఊగిసలో ఊయ లలో ఉందనా లేదనా..’ అంటూ సాగుతోందీ గీతం. చంద్రబోస్ రాసిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ వాసుకి వైభవ్ స్వరపర్చారు. ఈ చిత్రానికి డీవోపీ: పవన్ పప్పుల.






