24 July, 2026 | 1:58 AM

శ్రీవిష్ణు సరసన..

24-07-2026 12:00 AM

హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నరేశ్ వీకే, వెన్నెల కిషోర్, సుదర్శన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయాన్ని చిత్రబృందం ఇంతకాలం వెల్లడించలేదు. తాజాగా ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ కథానాయికగా నటిస్తున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

రోషన్ కనకాల హీరోగా దర్శకుడు సందీప్‌రాజ్ రూపొందించిన ‘మోగ్లీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాక్షి మడోల్కర్ ఇప్పుడు శ్రీవిష్ణు సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ అమ్మడు నటించిన తొలి సినిమా ‘మోగ్లీ’ మిశ్రమ స్పందన దక్కించుకోగా, తాజా చిత్రం ఈ భామకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి!