17 August, 2026 | 3:25 PM

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి...

17-08-2026 02:17 PM

నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలి 

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

సుల్తానాబాద్, ఆగస్టు 17 (విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఎం.జె.పి.టి.బి.సి.డబ్ల్యూ.ఆర్.ఐ.ఈ.ఎస్ బాలికల డిగ్రీ కళాశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.

ఈ సందర్భంగా కళాశాలలోని చాంబర్ ఆఫ్ డ్రీమ్స్ ను ప్రారంభించి,డార్మిటరీ, వంటగది, తరగతి గదులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యాభ్యాసం, భవిష్యత్ లక్ష్యాలు, కెరీర్ అవకాశాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు నాణ్యమైన విద్యతో పాటు భవిష్యత్ ఉపాధి అవకాశాలకు అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

అలాగే విద్యార్థులకు వారి ఆసక్తులు, సామర్థ్యాలకు అనుగుణంగా కెరీర్ గైడెన్స్ అందించాలని సూచించారు. జిల్లా కలెక్టరేట్ ద్వారా టిఏఎస్ కే సహకారంతో విద్యార్థులకు అవసరమైన మార్గదర్శకత్వం, శిక్షణ అందించేందుకు అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు అకడమిక్స్‌తో పాటు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటి నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, విద్యా సదుపాయాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ మణిదీప్తి, కళాశాల ప్రిన్సిపాల్ వనజతో పాటు సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.