ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
15-06-2026 03:34 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ విద్యా సంస్థల్లోని నాణ్యమైన విద్య అందించడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన అన్నారు. నిర్మల్ జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో వివిధ పాఠశాలలను సందర్శించి విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు వర్క్ బుక్కులు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరే విధంగా ఉపాధ్యాయులు ప్రతిరోజు బడిబాట చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది ఉన్నారు.






