2 July, 2026 | 2:33 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

17-04-2026 12:40 AM

ఎఫ్‌ఏఓ బాలాజీ నాయక్

మునుగోడు, ఏప్రిల్ 16 :ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన నైపుణ్యమైన ఉపాధ్యాయులు పనిచేస్తారని, ప్రభుత్వం విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుని నాణ్యమైన విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని ఎఫ్‌ఏఓ బాలాజీ నాయక్ పిలుపునిచ్చారు. మునుగోడు మండలం నేరటోని గూడెం ప్రాథమిక పాఠశాలలో గురువారం స్వపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి జిల్లా సమగ్ర శిక్షా ఎఫ్‌ఏఓ బాలాజీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆయన స్వపరిపాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థులను అభినందించి బహుమతులు అందజేశారు. ఈ విద్యా సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి తల్లమల్ల మల్లేశం, పలివెల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు తాటి శ్రీనివాస్, మునుగోడు పిఆర్టియు అధ్యక్షులు యూసుఫ్ పాషా, ప్రధాన కార్యదర్శి అన్నపురెడ్డి, గట్టుపల్ అధ్యక్షులు ఓగోటి శంకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎస్. మల్లయ్య, ఉపాధ్యాయులు ఎం. లవకుమార్, ఎమ్మర్సీ సిబ్బంది వి. దివ్య భాగ్యశ్రీ, జే. చంద్రమౌళి, కాంప్లెక్స్ సిబ్బంది పి. నర్సింహా, ఏ. సతీష్, సి.హెచ్. నాగరాజు, ఎన్. మహేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఉన్నారు.