పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం
23-06-2026 07:11 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం వనిపాకల గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో 2025-26 సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులను గ్రామానికి చెందిన రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి సభ్యుడు నన్నూరి ఉపేందర్ రెడ్డి ఒక్కో విద్యార్థికి 2 వేల చొప్పున అందజేసి శాలువాతో సన్మానించి పుస్తకాన్ని బహుమతిగా అందజేశారు. విద్యార్థులు తెలుగు,హింది, ఇంగ్లీషు భాషలలో అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంటే అన్ని సబ్జెక్ట్స్ లలో పరిపూర్ణత సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనయాచారి, గ్రామ సర్పంచ్ కొన్ రెడ్డి మహిపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ బద్దుల లింగస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్, ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






