5 May, 2026 | 3:51 AM

..ఎవరో చెప్తే రూ.లక్ష బహుమతి

05-05-2026 02:51 AM

అమెరికన్ నటి జో శర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో కొత్త సినిమా ‘ఎం4ఎం’ (మోటివ్ ఫర్ మర్డర్). దర్శకుడు మోహన్ వడ్లపట్ల దీన్ని సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఈ చిత్రం మే 8న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలుగు సినీ దర్శకుల సంఘం (టీఎఫ్‌డీఏ) అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, సీనియర్ డైరెక్టర్ వీ సముద్ర హాజరయ్యారు. ఈ సందర్భంగా వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. “మోహన్ వడ్లపట్ల తన టీమ్ తో కలిసి గొప్ప టాలెంట్‌ను తెరపై ప్రదర్శించారని ప్రశంసించారు. జో శర్మకు మంచి భవి ష్యత్తు ఉంది” తెలిపారు. సముద్ర మాట్లాడు తూ.. “మే 8న విడుదల కానున్న ఈ సినిమా పెద్ద హిట్ కావాలని ఆకాంక్షించారు.

మోహన్ వడ్లపట్ల గొప్ప దర్శకుడిగా ఎదగాలి” అన్నారు. హీరోయిన్ జో శర్మ మాట్లాడుతూ.. “అమెరికా నుంచి వచ్చి ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. ఇప్పటికే ఈ చిత్రానికి 25 దేశాల్లో 50కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చా యి. ప్రేక్షకులు సినిమాను చూసి హిట్ చేయాలి” అన్నారు. దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. “సినిమాలోని సీరియల్ కిల్లర్ ఎవరో చెప్పిన వారికి రూ.లక్ష క్యాష్ ప్రైజ్ ఉంటుంది. ‘ఎం4ఎం’ యూనివర్సల్ సబ్జెక్ట్. క్లైమాక్స్ ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ సినిమా ద్వారా ఒక కొత్త సినిమాటిక్ అనుభవాన్ని అందించబోతున్నాం” అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎఫ్‌డీఏ సెక్రటరీ పెండ్యాల, నటులు ఘర్షణ శ్రీనివాస్, ఎంఆర్‌సీ వడ్లపట్ల  కూడా మాట్లాడారు.