ఎంక్రోచ్ మెంట్ కు ప్రజలు సహకరించాలి
* ట్రాఫిక్ అంతరాయంలేని పట్టణంగా తీర్చిదిద్దాం
* మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టరీత్యా నేరం
* ట్రాఫిక్ అంతరాయం లేని పట్టణంగా తీర్చిదిద్దడమే మా లక్ష్యం: గద్వాల ట్రాఫిక్ సీఐ ఎం.విద్యాసాగర్
గద్వాల: గద్వాల పట్టణాన్ని ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేని ఆదర్శవంతమైన నగరంగా తీర్చిదిద్దడానికి ప్రజలు, వ్యాపారులు పూర్తి స్థాయిలో సహకరించాలని గద్వాల ట్రాఫిక్ సీఐ ఎం.విద్యాసాగర్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారి భద్రతపై ఆయన పలు కీలక సూచనలు చేశారు.
ఆక్రమణల తొలగింపునకు సహకరించాలి:
గద్వాల పట్టణంలో రోడ్ల పక్కన, ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణల వల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. గద్వాల మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్డుకు ఇరువైపుల అక్రమణలు తొలగించేందుకు వ్యాపారులు, ప్రజలు సహకరించాలని సూచించారు. 18 సంవత్సరాల లోపు ఉన్న మైనర్లకు వాహనాలు ఇవ్వడం చట్టరీత్యా నేరం అని, ట్రఫిక్ నియమాలను ఉల్లంఘించి మైనర్లకు వాహనాలు ఇస్తే, వారి తల్లిదండ్రులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి:
గద్వాల పరిసర ప్రాంతాల్లో జరిగే ఇసుక, మట్టి, అక్రమ, పీడిఎస్ బియ్యం అక్రమ రవాణా పైనా ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారని, నిబంధనలు మీరి అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. పట్టణ ప్రజల భద్రత, ప్రయాణ సౌకర్యం దృష్ట్యా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించి, సహకరించాలని ట్రాఫిక్ సీఐ ఎం.విద్యాసాగర్ తెలిపారు.






