30 May, 2026 | 5:23 PM

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి

30-05-2026 04:37 PM

డిసిసి అధ్యక్షురాలు ఆత్రం సుగుణ

అసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం ఏర్పాటు అనంతరం మొట్టమొదటిసారిగా జిల్లాకు విచ్చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం డిసిసి కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జ్ అజ్మీర శ్యాం నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ మంగతో కలసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

వెనుకబడిన కొమురం భీం జిల్లాను అభివృద్ధి చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి జిల్లాకు రానున్నట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తెలిపారు. పివిజిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. జిల్లాలో పెండింగ్ లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల మంజూరు కోసం కృషి సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని వివరించారు.

సీఎం పర్యటనలో భాగంగా జూన్ 1న కేరా మేరీ మండలం కొల్లం కొఠారి గ్రామంలోని 28 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించడంతోపాటు కోలం గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకి కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సీఎం బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా నుంచి రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు, రెండు లక్షల ఆసరా పెన్షన్ల మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.