9 May, 2026 | 11:54 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

జీహెఎంసీలో ప్రజావాణి వెలవెల

03-03-2026 01:20 AM

అర్జీదారులు లేక అధికారుల ఎదురుచూపు

ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు

సమస్యలు తీరాయా... లేక సమాచార లోపమా?

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2 (విజయక్రాంతి): జీహెఎంసీ ప్రధాన కార్యాల యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈసారి వెలవెలబోయిం ది. ఎప్పుడూ అర్జీదారులతో కిక్కిరిసిపోయే ప్రజావాణి హాల్ ఈ సోమవారం మాత్రం ఖాళీగా దర్శనమిచ్చింది.

వినతులు స్వీకరించేందుకు వివిధ విభాగాల ఉన్నతాధికారులు ఉదయం నుంచే సిద్ధంగా ఉన్నప్పటికీ, తమ గోడు చెప్పుకునేందుకు బాధితులు రాకపోవడంతో అధికారులు ఖాళీగా కూర్చుండిపో వాల్సిన పరిస్థితి ఏర్పడింది. జీహెఎంసీ హెడ్ ఆఫీసులో పదుల సంఖ్యలో అధికారులు కుర్చీల్లో కూర్చుని ఫైళ్లతో సిద్ధంగా ఉన్నా, ఎదురుగా ఉండే అర్జీదారుల కుర్చీలు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఉదయం 10 గం టల నుంచి మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి కొనసాగడంతో అధికారులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కాలక్షేపం చేశారు.

జనం రాకపోవడానికి గల కారణాలపై అధికారుల మధ్య చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ ఫిర్యాదుల వ్యవస్థ వల్ల ప్రజలు కార్యాలయానికి రావడం తగ్గించా రా.. లేక క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారమయ్యాయా అనే కోణంలో విశ్లేషిస్తున్నారు. జీహెఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించే ప్రక్రియ కొనసాగుతుండటం, జోనల్ కార్యాలయాల్లోనే స్థానిక సమస్యల పరిష్కారం జరుగుతుండటంతో ప్రజలు ప్రధా న కార్యాలయానికి రావడం లేదని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. సమస్యలు ఉన్నా అధికారుల చుట్టూ తిరగడం వల్ల ఫలితం ఉండదనే అసంతృప్తితో ప్రజ లు రావడం లేదా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.