6 July, 2026 | 8:53 PM

Breaking News

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక

22-03-2026 12:00 AM

ఎంఎంసీ కమిషనర్ టీ కృష్ణారెడ్డి క్షేత్ర స్థాయి పర్యటన

సికింద్రాబాద్,మార్చ్21 (విజయక్రాంతి): 99 రోజుల కార్యాచరణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఎంఎంసి కమిషనర్ కృష్ణారెడ్డి బోయినపల్లి సర్కిల్ లోని ప్రకాష్ నగర్, బేగంపేట లలో వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్డు పక్కన చెత్త సేకరణ పరిశీలించారు, ఎక్కడ చెత్త లేకుండా రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అదే ప్రాంతంలో నాలా లు పరిశుభ్రత పనులను పరిశీలించారు. నగర పౌరులు చెత్త నాలాల్లో వేయకుండా చర్యలు తీసుకోవాలని  ఆదేశించా రు. నాలాలలో చెత్త వేసే వారిపై జరిమాన విధించా ని తెలిపారు. అదేవిధంగా నాలాలు ఆక్రమణకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ కృష్ణారెడ్డి ఆదేశించారు.