7 July, 2026 | 7:34 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

గ్రామ పంచాయతీలకు ఆధునిక ఫర్నిచర్ అందజేత

18-02-2026 08:50 PM

తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు 

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న దాత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి మరో విశిష్ట సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సుభాష్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ పరిపాలన వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో తన సొంత ఖర్చుతో ప్రతి గ్రామ పంచాయతీకి సుమారు రూ.2 లక్షల విలువైన ఆధునిక కార్యాలయ ఫర్నిచర్‌ను అందించేందుకు ముందుకు వచ్చారన్నారు.

గ్రామ పంచాయతీలు ప్రజలకు అందించే సేవలు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా కొనసాగేందుకు తగిన వసతులు అవసరమని భావించిన సుభాష్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారనీ పేర్కొన్నారు. గ్రామ సర్పంచ్‌లు, కార్యదర్శులు, సిబ్బంది కార్యాలయాల్లో సౌకర్యవంతంగా పనిచేయడానికి అవసరమైన టేబుళ్లు, కుర్చీలు వంటి సామగ్రిని అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19 గురువారం మొదటి విడతగా సుమారు 50 నుండి 60 గ్రామ పంచాయతీలకు ఫర్నిచర్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వారు తెలిపారు.

నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, అధికారులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయాల రూపురేఖలు మారి, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. గ్రామీణాభివృద్ధి పట్ల తన అంకితభావాన్ని మరోసారి చాటుకుంటూ, ప్రజాసేవే పరమావధిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన సుభాష్ రెడ్డి ని స్థానిక ప్రజలు, నాయకులు అభినందిస్తున్నారనీ తెలిపారు.

ఇకపై  నియోజకవర్గ అభివృద్ధి కోసం విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల రంగాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాదాత, సామాజిక సేవకులు తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి, జనగామ గ్రామ సర్పంచ్ మట్ట శ్రీనివాస్, బీబీపట మండలం మాజీ వైస్ ఎంపీపీ  రవీందర్ రెడ్డి, అశోక్ గౌడ్, చాట్ల బాబు, సిద్ధ రాంరెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.