calender_icon.png 19 February, 2026 | 3:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతి సమైక్యతలో పటేల్ తెగువ అమోఘం

19-02-2026 01:19:46 AM

శాలివాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సుజాత

మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 18:  దేశ స్వాతంత్య్ర అనంతరం భారతదేశంలోని స్వదేశీ సంస్థానాలను భారత యూనియన్ లో విలీనం చేయడంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన తెగువ అమోఘమైనదని శాతవాహన యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ప్రొఫెసర్ ఎస్ సుజాత అన్నారు. బుధవారం మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర విభాగం నిర్వహించిన ‘ఐరన్ మ్యాన్స్ విజనరీ లీడర్ షిప్ లిబరేషన్ ఆఫ్ హైదరాబాద్‘ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ముగింపు సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.

భారత జాతిని జాగృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కీలక భూమిక పోషించారన్నారు. తెలంగాణ సంస్కృతి చాలా గొప్పదని, రాజకీయాలు మనం చూసే కోణాన్ని బట్టి మారతాయన్నారు. ఈ ముగింపు సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జైకిషన్ ఓజా, సెమినార్ కన్వీనర్ డాక్టర్ కె రాజయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేందర్ రెడ్డి, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.