16 June, 2026 | 5:28 PM

రహదారి నిర్మాణానికి నిధులు ఇవ్వండి: ఎంపీని కోరిన పెద్దగూడ వాసులు

16-06-2026 04:21 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండలంలోని పెద్దగూడ గ్రామం సమీపంలో ఇటీవల వాగుపైన బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. అయితే భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి పక్కన ఉన్న రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో గ్రామస్తులు రోడ్డు వసతికి నోచుకోలేకపోయారు. దీంతో సమస్యను మంగళవారం ఆదిలాబాద్ ఎంపీ జీ.నగేష్ దుర్సింగ్ తీసుకువచ్చారు. స్పందించిన ఎంపీ నిధుల మంజూరు చేసి సమస్య పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇవ్వడం జరిగింది. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ఎంపీని సన్మానించారు