10 May, 2026 | 10:17 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఘనంగా ఏక్ భారత్ భారత్

03-03-2026 12:45 AM

శ్రీరంగాపురం మార్చి 2: శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భారతదేశ ఐక్యత, సాంస్కృతిక వైవి ధ్యం, జాతీయ సమైక్యతను విద్యార్థులకు తెలియజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహన్ రాజు మాట్లాడుతూ దేశంలోని భిన్న భాషలు, సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నప్పటికీ భారతదేశం ఒక్కటే అన్న భావనను ప్రతి వి ద్యార్థి హృదయంలో నాటాలని అన్నారు.కార్యక్రమంలో విద్యార్థులు వివిధ రాష్ట్రాల సంప్రదాయ వేషధారణలతో ఆకట్టుకున్నారు.

భారతదేశంలోని రాష్ట్రాల ప్రత్యేకతలను వివరిస్తూ ప్రసంగాలు చేశారు. దేశభక్తి గీతాలు ఆలపించి, సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల భాషల్లో అభివాదాలు చెబుతూ ఐక్యత సందేశాన్ని అందించారు.ఉపాధ్యాయులు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో పరస్పర గౌరవం, జాతీయ ఐక్యత భావన పెంపొందుతుందని తెలిపారు.

కార్యక్రమం చివరలో ప్రతిజ్ఞ చేయించి దేశ ఐక్యతను కాపాడాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హనుమంతు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. మొత్తం కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా జరిగింది.