18 April, 2026 | 10:31 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..

18-04-2026 08:59 PM

బిజెపి ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ

మేడిపల్లి,(విజయక్రాంతి): చెట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లను సజావుగా అమలు చేసేందుకు వీలుగా నిన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన నియోజకవర్గాల పునర్విభజన  బిల్లును వెతిరికించిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాల తీరును నిరసిస్తూ శనివారం పీర్జాదిగూడ కార్పొరేషన్ బిజెపి అధ్యక్షులు జమ్ముల ప్రభాకర్ రెడ్డి పర్యవేక్షణలో నల్ల బ్యాడ్జీలతో నిరసన, ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ మహిళా సాధికారతకు అత్యంత కీలకమైన ఈ బిల్లును రాజకీయ కారణాలతో అడ్డుకోవడం అన్యాయమని, దేశాభివృద్ధికి కీలకమైన 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కావాలంటే నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరని తెలిసి కూడా, విపక్షాలు రాజకీయ స్వార్థంతో దీనిని అడ్డుకోవడం అత్యంత దురదృష్టకరం అన్నారు.

ఈ చారిత్రాత్మక నిర్ణయానికి సహకరించాల్సింది పోయి, కుంటిసాకులతో అడ్డంకులు సృష్టిస్తూ కాలయాపన చేయడం వారి ద్వంద్వ నీతికి, మహిళా వ్యతిరేక ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన ప్రక్రియలను అడ్డుకుంటూ దేశ ప్రగతిని వెనక్కి నెట్టాలని చూస్తున్న విపక్షాల తీరును ప్రజలు గమనిస్తున్నారని రానున్న రోజుల్లో విపక్షాలకు తగిన గుణపాఠం చెబుతారని అభిప్రాయపడ్డారు.

ఈ నిరసన కార్యక్రమంలో బిజెపి మహిళా నాయకులు బోగా గీతారాం, సుజాత రెడ్డి, మాధవి, పుష్ప, స్వప్న, మేడ్చల్ రూరల్ బీజేవైఎం అధ్యక్షులు పవన్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా కార్యదర్శి జైపాల్ రెడ్డి, మేడ్చల్ రూరల్ జిల్లా కార్యవర్గ సభ్యులు కరుణాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మహేందర్ రెడ్డి, పీర్జాదిగూడ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శిలు బాల్ రెడ్డి, సరూప్ చంద్ర, ఉపాధ్యక్షులు సంతోష్, మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు, బీజేవైఎం సభ్యులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.